మచిలీపట్నంలోని చిలకలపూడి పాండురంగ మున్సిపల్ హైస్కూల్లో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగా పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 14వ తేదీ వరకు ఈ పోటీలు ఉండనున్నాయి. విజేతలుగా నిలిచిన వారు 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు.