ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. జి. కొండూరు కమ్యూనిటీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విని, సానుకూలంగా స్పందించి, వారి సమస్యలపై పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు.