విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్, కొండపల్లి పురపాలక అదనపు కమిషనర్ బి. రమ్య కీర్తనకు అవార్డు లభించింది. నగరంలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. సృజన ప్రతిభా అవార్డును అందజేశారు. కమిషనర్ కు అవార్డు లభించడం పట్ల కొండపల్లి మున్సిపల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు.