అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బుధవారం మైలవరంలోని టవర్స్ వద్ద అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి గౌతమ్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వస్తే వెంటనే సిలిండర్ను ఆఫ్ చేయాలని సూచించారు. కరెంటు ద్వారా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యక్షంగా ప్రజలకు చేసి చూపించారు.