మద్దులపర్వలో రూ.45.9 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం

65చూసినవారు
రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలో రూ. 45. 9 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాదు సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ పట్టిందన్నారు. గత ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్