ఇబ్రహీంపట్నం రైతు బజార్ లో ఆవుల బెడద

74చూసినవారు
ఇబ్రహీంపట్నం రైతు బజారులో ఆవుల బెడదతో బెంబేలెత్తుతున్నారు. మంగళవారం రైతు బజారులో ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఆవులు దర్శనమిస్తున్నాయి. రైతు బజారులోకి వచ్చే వినియోగదారులు ఆవులకు భయపడుతున్నారు. చేతుల్లో సంచులు కనిపిస్తే అవి తినేందుకు ఎగబడటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో రైతు బజారులో ఆవులు దిష్ట వేసుకొని కూర్చున్నాయి.

సంబంధిత పోస్ట్