ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూడాల్సిన ప్రదేశంలో పళ్ళ దుకాణాలు నిర్వహించటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. బస్సు ఆగాల్సిన ప్రదేశంలో ఆగకపోవటంతో ప్రయాణికులు తమ లగేజీతో రోడ్డుమీద నడవాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కాలంటే ఇబ్బందులు తప్పడం లేదు.