వెలగలేరులో 25 సంవత్సరాల తర్వాత కలిసిన మిత్రులు

67చూసినవారు
వెలగలేరులో 25 సంవత్సరాల తర్వాత కలిసిన మిత్రులు
వెలగలేరులోని చనమోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులు (1999-2000) 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఆదివారం వెలగలేరులోని హైస్కూలులో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తమకు బాల్యంలో విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొని, అలనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్