మైలవరం మండలం గణపవరం వద్ద కృష్ణ వాటర్ పైపు పగిలి మంచినీరు వృధాగా పోతోంది. విజయవాడ నుండి నూజివీడు వరకు లక్షల రూపాయల ఖర్చు పెట్టి 2009లో ప్రభుత్వం కృష్ణ వాటర్ పైప్ లైన్లు వేసింది. కాగా గణపవరం వద్ద కృష్ణ వాటర్ పైపు పగిలి వృధా మంచినీరు పోతున్నాయి అని స్థానికులు ఆరోపించారు. పైపు పగిలిన వద్ద నీరు నిల్వ ఉండడంతో మురిగిపోయి పగిలిన పైపులోకి చేరుతున్నాయని అన్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.