మైలవరం నియోజకవర్గ పరిధిలోని దేవాలయ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ కి వినతిపత్రం అందజేశారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఆయన్ని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు బుధవారం కలిశారు. పలు దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో పాటు రైతుల భూములు 20 ఎకరాలకు సంబంధించి ఎన్. ఓ. సి జారీ చేయాలని కోరారు.