మైలవరంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలకు ఎండల బాధ నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. ఉదయం నుంచి ఉక్కపోతతో వాకబు తేలని పరిస్థితి నెలకొంది. అయితే వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పంటలు నష్టపోయాయని రైతులు వాపోతుండగా, పాడిరైతులు, ప్రజలు వర్షం పడినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.