కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై టీడీపీ కౌన్సిలర్ శ్రీను క్లారిటీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థే చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తారని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. వైసీపీలో 9 మందిలో నలుగురు టీడీపీ కౌన్సిలర్లతో ఉన్నారని, రేపు మాపో ఆ నలుగురు కూడా టీడీపీలోకి రావడం ఖాయమని అన్నారు. ఇంకా వైసీపీఏ విజయమని ఏ విధంగా భ్రమ పడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.