ఇబ్రహీంపట్నంలో టెండర్ సమయంలో చిరు వ్యాపారులు, ఫుట్ పాత్ వ్యాపారుల నుంచి ఆశీల్ వసూలు చేయబోమని ఇప్పుడు డబ్బులు దండుకుంటున్నారని ఓ చిరు వ్యాపారి వాపోయాడు. తట్ట పెడితే రూ. 30, బండి పెడితే రూ. 50 మేర ఆశీల్ వసూలు చేస్తున్నారని అతడు మంగళవారం నిర్ఘాంతపోయాడు. తాను తాటి ముంజులు కొట్టుకునే చిరు వ్యాపారినని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.