భవన నిర్మాణ సంక్షేమ బోర్డు తక్షణమే పునఃప్రారంభించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని మండల ప్రెసిడెంట్ పెండ్యాల వెంకటేశ్వరరావు కోరారు. ఈ నేపథ్యంలో గురువారం ఇబ్రహీంపట్నం భవన నిర్మాణ కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. గత 6సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దౌర్భాగ్యమని వాపోయారు. మే 20న చేపట్టే సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.