మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల చేసిన విమర్శలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తిప్పుకొట్టారు. తాను పారిపోవాల్సిన అవసరం లేదని, కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి అభ్యర్థులదే విజయమని, అప్పటి ఎంపీ ఓటుపై స్వష్టత లేకపోవడంతో అధికారులు నిలుపుదల చేశారని అన్నారు. తాడు బొంగరం లేని వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 151కి మధ్యలో ఐదు ఎగిరిపోయిన ఇంకా తానే నడుపుతున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు