ఇబ్రహీంపట్నం మండలంలో సర్కారు బడులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మండలంలో మొత్తం 38 పాఠశాలల్లో 4, 834 మంది విద్యార్థులు, 106 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. నాడు- నేడు పథకంలో భాగంగా రూ. 8. 33 కోట్లతో పాఠశాలల్లో భవనాలు, ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్లు నిర్మించారు. ప్రహరీలు లేని పాఠశాలలు ఐదు ఉన్నాయని, వాటిని మన బడి- మన భవిష్యత్లో భాగంగా అభివృద్ధి చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం కోరుతున్నారు.