మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంకు చెందిన న్యాయవాది వల్లభనేని నాగపవన్ కుమార్ గురువారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో మైలవరం నియోజక వర్గానికి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా, మచిలీపట్నానికి స్వతంత్ర పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఇప్పటి వరకు ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోకపోవడం గమనార్హం.