ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడు రైల్వే గేటు పడిందంటే ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ఇక్కడ స్టేషన్ ఉన్న ఎక్కువ రైళ్లు ఆగకపోవటంతో వెంటనే గేటు తీసేవారు. కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందటంతో విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఉన్న రాయనపాడులో ప్రతి రైలు ఆగటంతో ఇక్కడ గేటు పడిపోతుంది. రాయనపాడు, ఈలప్రోలు గుంటుపల్లి, కొండపల్లికి వెళ్లే ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడక తప్పటం లేదు.