జి. కొండూరు (మం) వెలగలేరులో కరకట్ట పనుల ముసుగులో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. వెలగలేరు కెనాల్ సమీపంలోని అటవీ భూముల నుండి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ తవ్వి రవాణా చేస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. పదుల సంఖ్యలో వాహనాలతో జరుగుతున్న ఈ అక్రమ రవాణాపై అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే క్వారీ నుండి అక్రమంగా మట్టి మైనింగ్ చేశారు అంటూ కొంతమంది అధికారులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.