ఇటీవల వెల్లడైన ఇంటర్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన జగ్గయ్యపేట బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే సంవత్సరం మరింత మైరుగైన సత్ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. బాలికల ఉన్నత పాఠశాలలో కళాశాలకు, పాఠశాలకు అనుబంధంగా హాస్టల్ వసతిని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేస్తానని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని హామినిచ్చారు.