ఏపిడబ్లూజెఎఫ్ మైలవరం నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అక్రిడేషన్ కార్డ్స్ మంజూరు చేయాలనీ జర్నలిస్టులు నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాహసిల్దార్ సాయి మహేష్ కు అందజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ దృష్టికీ తీసుకువెళ్లి సమస్యను పరిస్కారం చేయాలనీ ఆయనను కోరారు.