కంచికచర్ల: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్‌: ఎమ్మెల్యే

56చూసినవారు
కంచికచర్ల: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్‌:  ఎమ్మెల్యే
ప్రజాసమస్యలను తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకే ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. బుధవారం కంచికచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు వినతులు అందజేశారన్నారు. తాగునీటి సమస్యలు, రెవెన్యూ, గృహ నిర్మాణాలు, కరెంటు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు అందజేశారు.

సంబంధిత పోస్ట్