ఈనెల 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కు జన సైనికులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్రావు (గాంధీ). ఇబ్రహీంపట్నం తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అనంతరం సభ సంబంధించిన పోస్టర్ ను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు.