కృష్ణా :బైక్ టిప్పర్ ఢీ: మహిళకు తీవ్ర గాయాలు

71చూసినవారు
కంచికచర్ల మండలం కీసర 65వ జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గేదె అడ్డురావడంతో విజయవాడ వైపు వెళ్తున్న బైక్ వెనుక నుంచి వస్తున్న ఇసుక టిప్పర్ని ఢీకొట్టింది. ఘటనలో బైక్పై ఉన్న జ్యోతి (32)కి తీవ్ర గాయాలు కాగా, ఆమెను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్