రెడ్డిగూడెంలో భూమి వివాదం: పోలీసులపై రైతు ఆరోపణలు

59చూసినవారు
రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామంలో  పొలాన్ని ఆక్రమించిన ఘటన జరిగింది. రైతు నరసింహారెడ్డి  బుధవారం మాట్లాడుతూ 1972లో కొనుగోలు చేసిన భూమిని కొంతమంది తమదంటూ దౌర్జన్యంగా ఆక్రమించి, తానే తప్పు చేసినట్టు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కోర్టులో ఉన్న భూమిలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిపై పోలీసులు అణచివేయడం కంటే, వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. రైతు ఈ విషయంలో జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్