తిరువూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం, కోకిలంపాడు గ్రామానికి చెందిన పడిగదలంప రమేశ్, బైక్ మెకానిక్ గా పని చేస్తాడని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రమేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు తిరువూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అన్నారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా సోమవారం మృతి చెందినట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.