మైలవరంలో టీడీపీ నేతకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

84చూసినవారు
మైలవరంలో టీడీపీ నేతకు నివాళులర్పించిన ఎమ్మెల్యే
మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన కనగాల వెంకటరామయ్య , ఆయన సతీమణి పద్మావతి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆదివారం మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిరువురి చిత్రపటానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్