గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజాను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి కోరారు. మైలవరంలో గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ గెలుపునకు కృషి చేయాలని ఆమె ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించింది. రాజా గెలుపు ప్రతి ఒక్కరు గెలుపుగా భావించి విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు.