ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు గురువారం చేరువ వాహనం ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి కాలనీ ప్రాంతాలలో సైబర్ నేరాలైన హనీ ట్రాప్, సెక్స్ టార్షన్, ఇంపర్సనేషన్, మాట్రిమోనీ ఫ్రాడ్స్ పై వీడియో రూపంలో ప్రదర్శించామని గురువారం పోలీసులు వివరించారు.