కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఏడాది పూర్తైన సందర్భంగా రెడ్డిగూడెం అంకమ్మ తల్లి ప్రాంగణంలో శుక్రవారం తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. మహిళా సంఘాల నాయకులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. విద్యార్థులకు రూ. 15 వేలు ఇచ్చిన ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిబద్ధత చూపుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి నాగేశ్వర రెడ్డి ప్రశంసించారు.