రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కొండపల్లిలో రక్తదాన శిబిరం నిర్వహించారన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ఛైర్మన్ డా. వెలగా జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరానికి కలెక్టర్ అతిథిగా హాజరయ్యామాన్నారు.