ఇటీవల మైలవరం ప్రాంతంలో అకాల వర్షాలు కురిశాయి. రుతుపవనాలు కూడా పది రోజుల్లోగా రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు తొలకరి పంటలు వేసేందుకు తొలుత పొలాలలో దుక్కులు దున్నటం ప్రారంభించారు. మండలంలో వ్యవసాయ పనులు చురుకుగా సాగుతున్నాయి. తొలకరి వర్షాలు ప్రారంభంగా గానే పత్తి పంటలు వేయటానికి ముందుగానే పొలాలను సిద్ధం చేస్తున్నారు.