విజయవాడ రూరల్ మండలంలోని ముగ్గురు లబ్ధిదారులకు రూ. 89 వేలు, ఇబ్రహీంపట్నం మండలంలోని 10 మందికి రూ. 8. 79 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి. గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను, సీఎం సందేశ పత్రాలను ఎమ్మెల్యే కృష్ణప్రసాదు లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.