ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎన్నికల హామీల అమల్లో భాగంగా వచ్చే ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలోని ఆర్టీసీ బస్ డిపోలో ఇబ్రహీంపట్నం నుంచి తిరుపతి, కొండపల్లి నుంచి విశాఖపట్నంకు నడిపే రెండు నూతన బస్సు సర్వీసులను శుక్రవారం శాసనసభ్యులు ప్రారంభించారు.