తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ఉత్తరద్వారం గుండా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.