ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మూలపాడు వద్ద శుక్రవారం ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు ద్విచక్రవాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.