మైలవరం మారుతునగర్ లోని ఓ ఇంటిలో బాబు, పాప అనుమానస్పదంగా గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. పిల్లలను చంపి తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు తండ్రి రవిశంకర్ రాసిన లేఖతో పోలీసులు హత్యగా నిర్ధారించారు. శనివారం సాయత్రం మైలవరంలో పిల్లలకు అంత్యక్రియలు చేస్తుండగా తల్లి తల్లడిల్లింది. బిడ్డలను చూసి అమ్మనొచ్చాను. ఒక్కసారి లేవండి అంటూ ఆమె రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.