మైలవరం నియోజకవర్గంలో 'పల్లెపండుగ' రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు కనుల పండువగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మండుటెండల్లో సైతం గ్రామాల్లో పర్యటిస్తూ సీసీ రోడ్లను ప్రారంభిస్తున్నారు. మైలవరంలోని పూరగుట్టలో వరకు రూ. 64 లక్షల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 1080 మీటర్ల పొడవునా నిర్మించిన సిమెంట్ రహదారిని మంగళవారం ప్రారంభించారు.