రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. దళిత కాలనీకి నిర్మించుకున్న ఆర్చికి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ నగర్ గా పేరు పెట్టుకున్నామని గ్రామస్తులు తెలిపారు. దీంతో బాబు జగజీవన్ రామ్ నగర్ గా పేరును పెట్టడాన్ని గ్రామ నాయకులు అడ్డుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాబు జగజీవన్ రామ్ పేరు పెట్టినందుకు దళితులపై, అక్రమంగా కేసులు పెట్టడం పై ఆందోళనకు దిగారు దళితులు.