మైలవరం మారుతి నగర్‌కు చెందిన వేములమాడ అనిత (49) తన భర్త లక్ష్మీపతి (54) మిస్ అయినట్లు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బార్బర్ షాప్‌లో పనిచేస్తున్న లక్ష్మీపతి అప్పులు చేసి తీర్చలేక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.