ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో మంగళవారం మాట్లాడుతూ, చెరువు మాధవరం వద్ద గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన 230 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటు కోసం వినియోగించాలని కోరినట్లు వెల్లడించారు. ఇంకా పలు సమస్యలు మంత్రి తీసుకున్నట్లు తెలిపారు.