ఇబ్రహీంపట్నం మండలంలోని జూపూడి గ్రామంలో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టిటీపీఎస్ యాజమాన్యం కృష్ణ ప్రసాదు కి ఘన స్వాగతం పలికింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని, వైద్యులను వివిధ పరీక్షల గురించి వాకబు చేశారు. గ్రామ పెద్దలను, స్థానికులను పలకరించారు.