మైలవరం పట్టణంలోని వీ. వీ. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మెనూలో చేర్చిన ఆహార పదార్థాలు పరిశీలించారు. రుచితో పాటు శుచిగా భోజనాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులను ఆదేశించారు.