శ్రీవారిని దర్శించుకున్న మైలవరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
By పల్లె పాము అర్జునరావు 72చూసినవారుకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాదు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు శుక్రవారం శాసనసభ్యులు సతీమణి శిరీషతో పాటు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లి స్వామివారి సేవలో తరించారు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో , సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.