ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఆర్ధిక సాయాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. మైలవరం మండలంలోని 22 మందికి తాజాగా రూ. 17, 50, 909లు మంజూరయ్యాయి. మైలవరంలోని పుల్లూరు, చండ్రగూడెం, అనంతవరం గ్రామాల్లో ఈ సొమ్మును ఎమ్మెల్యేలబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేశారు. వీటితోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సందేశ పత్రాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు.