కొండపల్లి పట్టణంలోని ఖిల్లా రోడ్డు సెంటర్లో జాతీయ రహదారిపై మురుగు నీటి సమస్యను మున్సిపల్ అధికారులు పరిష్కరించారు. గత 20రోజుల నుంచి ఖిల్లా రోడ్డు ప్రాంతంలో నుంచి వచ్చే మురుగు నీరుతో దుర్గంధం వ్యాపించడంతో ఆ పరిసరాల్లో నిలబడలేని దుస్థితి ఏర్పడింది. ఈ సమస్యను స్థానికులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు శనివారం మురుగు నీటి సమస్యకు పరిష్కారం చూపారు.