ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో ఈ నెల 6న నమోదైన అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని పోలీసులు తేల్చారు. తమ తండ్రి సైకం ప్రభాకర్ పై దాడికి పాల్పడిన నడకుదిటి ఏసుబాబుపై ప్రతీకారం తీర్చుకోడానికే హత్యకు ప్లాన్ చేసినట్లు ప్రభాకర్ కుమారులు అన్నారు. ఈ నెల 5న రాత్రి నడకుదిటి ఏసుబాబుని కారుతో గుద్ది హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపిన సీఐ చంద్రశేఖర్ అన్నారు. ప్రభాకర్ కుమారులు కుమార స్వామి, నవీన్ తో పాటు హత్యకు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.