మైలవరం: జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం

59చూసినవారు
మైలవరం: జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మైలవరం మండలం తోలుకోడులో జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అన్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. ఇళ్ల మధ్య పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని తెలిపామన్నారు.

సంబంధిత పోస్ట్