పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ కూన రవికుమార్ ఆధ్వర్యంలో తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పి. యు. సి సభ్యులైన మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలపై ఈ సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. దుర్వినియోగం వంటి వాటిపై పరిశీలన చేసి అసెంబ్లీకి నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు.