కొండపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు వాలీబాల్ హెచ్సీఎల్ టోర్నమెంట్ కు ఎంపికయ్యారు. తోటపల్లి అండర్-15 బాలికల వాలీబాల్ హెచ్సీఎల్ టోర్నమెంట్ సెలక్షన్స్ జరిగాయి. దీనికి 9 తరగతి విద్యార్థినులు హేమాదేవి, ఫణినాగదీపిక, యక్షిబా, వెంకటదుర్గ ఎంపికయ్యారు. ఈ నెల 24, 25 తేదీల్లో బెంగళూరులో జరిగే వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వీరు అర్హత సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ టీమ్కు ప్రాతినిథ్యం వహించనున్నారు.